ఎదులాపురం, ఫిబ్రవరి 15 : దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరు స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ నగర్ లో శ్మశాన వాటిక అభివృద్ధ్ది పనులను బుధ వా రం ఆయన ప్రారంభించారు. రూ.45 లక్ష వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేం దర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు కాలనీవాసులు స్వాగతం పలి కారు. అనంతరం గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేశారు. స్థానికులు ఎమ్మెల్యేను శాలువాతో సత్క రించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామ న్న మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కోట్లాది రూపా యల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతు న్నాయని తెలిపారు. పట్టణ సుందరీకరణతోపాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం గా ముందుకు సాగుతున్నామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, డీఈ తిరుపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ రషీద్, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు నవీన్, అయూబ్, అన్వేశ్, వెంకటేశ్ ఉన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 15 : జిల్లా కేంద్రం లోని ఎస్సీ స్డడీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2022-23 సంవత్సరంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ సందర్భంగా స్డడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్డడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు దాసరి రమేశ్, తదితరులు ఉన్నారు.
ఎదులాపురం(జైనథ్), ఫిబ్రవరి15 : ఉచితాలు వద్దంటున్న బీజేపీ సర్కారుకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బుధవారం కంఠ గ్రామం లోని రైతు భవనం, సీసీ రోడ్డు, రాంమందిర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కంటలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.50లక్షలతో రాంమందిర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలో 96 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజే శారు. అంతకు ముందు కంఠ గ్రామానికి చెందిన పలు వురు యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయ కులు బీఆర్ఎస్లో చేరారు. ఎంపీపీ మర్శింటి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమా ర్, నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, ఎస్ లింగారెడ్డి, ఊశన్న, పురుషోత్తం యాదవ్, వేణుగోపాల్ యాదవ్, సర్పంచ్‌లు వైద్య బాలజీ, దేవన్న, ఉపసర్పంచ్ సంతోష్, మాజీ ఎంపీటీసీ రాజు, గణేశ్ యాదవ్, గడ్డం జగదీశ్ రెడ్డి ఉన్నారు.