ఆదిలాబాద్‌టౌన్, జూలై 21: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ఆదిలాబాద్‌లోని సాయివైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్, గ్రూపు-4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయివైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. అధ్యాపకులు, అభ్యర్థులు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్, డైరెక్టర్లు నర్ర నవీన్ యాదవ్, మహేందర్, శరత్ యాదవ్, ఊశన్న, వేణు, రవికాంత్, రామన్న, వీరేశ్‌యాదవ్, భీమన్న, రమేశ్, శ్రీకాంత్, పోశాలు, రమణ పాల్గొన్నారు.
బేల, జూలై 21: మండలంలోని పాఠన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్ , సర్పంచ్ ఫైజుల్లాఖాన్, డైరెక్టర్లు నర్ర నవీన్ యాదవ్, మహేందర్, శరత్ యాదవ్, ఊశన్న, వేణు, రవికాంత్, రామన్న , భీమన్న, రమేశ్, శ్రీకాంత్, పోశాలు, రమణ పాల్గొన్నారు.