లోకేశ్వరం, అక్టోబర్ 19 : ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పథకాలు అందించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వమే టాప్లో ఉందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరంలో బుధవారం మండ ల నాయకులతో కలిసి ఆయా గ్రామాల 111 మంది లబ్ధిదారులకు రూ.1,11,2876 విలు వైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రజా ఎజెండాగా ప్రజల సహకారం తో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నద ని చెప్పారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పండుగలకు బతుకమ్మ, రంజాన్ కానుకలు, మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీకి రుణా లు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.
అనంతరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘ భవనానికి రూ.4 లక్షలు, పొట్పెల్లి (బీ) రోడ్డు మరమ్మతులకు రూ.2.50 లక్షలు మంజూరు కాగా, ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లోలం శ్యాం సుందర్, వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి, తహసీల్దార్ సరిత, డీటీ అశోక్ కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు చిన్నారావు, మెండే శ్రీధర్, ఎం ఆం జనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిరుమని దిగంబర్, భోజన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగ్రావు, ఆయా గ్రామాల లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.