నార్నూర్, అక్టోబర్ 17: గతంలో మాతాశిశు మరణాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండేవి. వీటిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణుల్లో ముఖ్యంగా హైరిస్క్ ఉన్న వారిని ఎంపిక చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. సురక్షిత ప్రసవం కోసం హైరిస్క్ గర్భిణులతో పాటు ప్రతి గర్భిణీకి వైద్య సిబ్బంది సమయానికి ఆరోగ్య పరీక్షలు, మందులు అందేలా చూస్తున్నారు.
ఉమ్మడి మండలంలో రెండు పీహెచ్‌సీలు,సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. 2021-2022లో గర్భిణులు 888 ఉండగా, 665మంది బాలింతలు ఉన్నారు. హైరిస్క్ గర్భిణులు 10మంది ఉన్నారు. ప్రతీ పీహెచ్సీలో వందశాతం ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో నిత్యం ప్రసవాలు జరుగుతూనే ఉన్నా యి.
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ…
ప్రసవాల సమయంలో హైరిస్క్ గర్భిణులే అధికంగా మరణిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వైద్య సిబ్బంది గర్భిణుల పర్యవేక్షణ బాధ్యతను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య పర్యవేక్షకులు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణుల వెంట ఉంటున్నారు. ఎప్పటికప్పడు వారికి పరీక్షలు చేయిస్తున్నారు. హైరిస్క్‌గా గుర్తించిన వారికి ప్రసవం అయ్యే వరకు ప్రతి నెలా సేవలు అందేలా చూస్తున్నారు. గర్భిణుల ఇళ్లకు వెళ్లి మందులు సమయానుకూలంగా వేసుకునేలా చూస్తున్నారు. ముఖ్యంగా గైనకాలజిస్టులు అందుబాటులో ఉండే పీహెచ్సీ, జిల్లా, ఏరియా వైద్యశాలలకు వీరిని తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. వీరికి ఏ దవాఖానలో ప్రసవం సురక్షితంగా ఉంటుందో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
గర్భిణుల్లో సమస్యలు రావడానికి కారణాలు
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం
సాధారణ, హైరిస్క్ కేసులపై ప్రతి నెలా పీహెచ్సీలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. గర్భిణుల మొబైల్ నంబర్ తీసుకొని వారితో పాటు కుటుంబసభ్యులతోనూ ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి నెలా తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నం. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నాం.
డాక్టర్ రాజమణి, నార్నూర్ పీహెచ్సీ