ఎదులాపురం,అక్టోబర్17: తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్‌ను కచ్చితంగా పాటించాలని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ అధ్యక్షతన ఆదిలాబాద్ పట్టణంలోని 45 ప్రముఖ వైద్యశాలలు సంస్థ ప్రతినిధులు వైద్యులతో భద్రతపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, బయటి ప్రాంతాలు సీసీటీవీ పరిధిలోకి వచ్చేలా కనీసం రెండు నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. ఈ రెండు కెమెరాలు కనీసం 30 రోజుల బ్యాక్ఆప్ను కలిగి ఉండాలన్నారు. దీంతో నేర నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ కెమెరాలు నిందితులను త్వరగా పట్టుకోవడంలో దోహద పడుతాయని చెప్పారు. వీలైతే ఈ కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని తెలిపారు. అనంతరం వైద్యులకు కమాండ్ కంట్రోల్‌ను చూపించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న నిఘా నేత్రాల పనితీరును వారికి తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు పీ సురేందర్, కే.శ్రీధర్, కే.మల్లేశ్, బీ రఘుపతి,ఎస్ఐ విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా సంస్మరణ వేడుకలు
పోలీస్ అమరుల సంస్మరణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పలు ప్రజా కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ఏటా అక్టోబర్21న పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19న ప్రజల సహకారంతో స్థానిక పోలీస్ హెడ్కార్వర్టర్స్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పోలీస్ అమరుల స్తూపం వద్ద జిల్లా ప్రభుత్వయంత్రాంగం, ప్రజాప్రతినిధులతో కలిసి నివాళు లర్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులకు గౌరవంగా ఆహ్వానం పలికి జ్ఞాపికలు అందించనున్నట్లు వెల్లడించారు.