నిర్మల్ టౌన్, అక్టోబర్ 10 : ఈ నెల 16న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గ్రూపు 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సోమవారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామ ని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని వసతు లు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తం 4,620 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వ హించనున్న ఈ పరీక్షకు అవసరమయ్యే సిబ్బం దిని ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రా ల్లో విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకో వాలని, అందుకు అవసరమయ్యే బస్సులను ఆర్టీసీ వారు నడిపించాలని కోరారు. విద్యుత్ కోత లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని తనిఖీ చేస్తామని, ఎక్కడ లోపాలు లేకుండా చూసుకో వాలన్నారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.