ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 10 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్లో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువలా సాగింది. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఊరేగింపుగా రథాన్ని లాగారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిట కిట లాడింది. ఆదివారం జాతర, సోమవారం రథోత్స వం నిర్వహించడంతో సుమారు 40 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. భక్తులు కట్న, కానుకాలు సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పండితులు చక్రపాణి నరసింహ మూర్తి చార్యులు, ఆచార్య కోటపల్లి అనిశ్, తదిత రులు పాల్గొన్నారు. జడ్పీ టీసీ ఆకుల రాజమణి, సర్పంచ్ చెప్పాల అనురాధ, నాయ కులు ఆకుల వెంకగౌడ్, వెంకట్రాజం, రాము నాయక్, జంగిలి రాజేందర్, బక్కి కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.