ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 9 : జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమించిన వీరుడు, ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీం వర్ధంతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల కుమ్రం భీం విగ్రహానికి ఎస్పీ ఉదయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, రాంకిషన్, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, అక్టోబర్ 9 : కుమ్రం భీంను ఆదర్శంగా తీసుకోవాలని ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు బోరిగాం గ్రామంలో ఆదివారం కుమ్రం భీం వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి, చిత్రపటానికి ఇచ్చోడ సీఐ నైలు, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బోరిగామ సర్పంచ్ భీంరావ్, ఉపసర్పంచ్ ఆశన్న, వైస్‌ఎంపీపీ జలై జాకు, ఎంపీటీసీ శివకుమార్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి నగేశ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్ 9 : మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజనులు, దళితులు, గిరిజనేతరుల ఆధ్వర్యంలో కుమ్రం భీం 82వ వర్ధంతి నిర్వహించారు. ఆదివాసీ జెండాలతో భారీ ర్యాలీ తీశారు. భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, మాజీ ఎంపీపీ తుకారాం, నాయకులు ఆర్కా ఖమ్ము, గోద్రు, నాగోరావ్, జుగ్నాక్ భరత్, సుంకట్రావ్, మారుతి, వెంకట్రావ్, రాజలింగు, రాందాస్ పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 9: బోథ్, సొనాల, ధన్నూర్(బీ)లో ఆదివాసులు, గ్రామస్తులు కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గజేందర్, మహేందర్, పసుల చంటి, ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 9 : మండల కేంద్రంతో పాటు బాది, వాడగూడ గ్రామాల్లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మండలాధ్యక్షుడు నందుకుమార్, ఉప సర్పంచ్ దంతవినోద్, వార్డు సభ్యులు , ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉట్నూర్, అక్టోబర్ 9 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ మహేందర్ కుమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సిరికొండ, అక్టోబర్ 9 : మండలం కేంద్రంలో ఆదివాసీ నాయకులు, గిరిజనులు సంప్రదాయంగా డోలు వాయిస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కుమ్రం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమృత్‌రావ్, జడ్పీటీసీ చంద్రకళ, ఎస్ఐ నీరేశ్, ఆదివాసీ మండల నాయకులు యాదవ్ రావ్, పాండు, సర్పంచ్‌లు, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 9 : ఆదివాసుల ఆరాధ్యదైవం కుమ్రం భీం వర్ధంతిని మండలంలోని అంబుగాం, గిరిగాం గ్రామాల్లో ఆదివాసులు నిర్వహించారు. కుమ్రం భీం విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మండలాధ్యక్షుడు ఆత్రం భరత్, సర్పంచ్‌లు యశ్వంత్, గజానన్, కృష్ణ, నాయకులు అరుణ్‌కుమార్, ధనుంజయ్, గంగారాం, నరేశ్, రమణ పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 9 : కుమ్రం భీం గొప్ప పోరాట యో ధుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మడావి లింబాజీ పిలుపునిచ్చారు. బేల్సరిరాంపూర్ గ్రామంలో ఆదివాసులతో కలిసి కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రూప, చిన్ను, సయ్యద్ బాదర్, నాయకులు అన్నుపటేల్, సంతోష్, పాండురంగ్, పురుషోత్తం పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 9 : లింగట్ల గ్రామంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్ కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ పెద్దలు జెండా ఎగురవేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 9 : నిపాని, గోనా, మర్కాగూడ గ్రామాల్లో నాయకులు కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజన్న, బాదర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, ఉపసర్పంచ్ ప్రణీత, నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్, అక్టోబర్ 9 : మండల కేంద్రంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ధరణి రాజేశ్, సోనేరావ్, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
హస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవ్‌గూడలో ఆదివాసులు కుమ్రం భీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కోసు పటేల్, మాణిక్‌రావ్, బాపురావ్, చందు, ఆనంద్‌రావ్, జావిద్, అశోక్, కైలాస్ పాల్గొన్నారు.