ఉట్నూర్, అక్టోబర్ 9 : జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం నేటి తరానికి స్ఫూర్తిదాత అని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. కుమ్రం భీం వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కేబీలో ఆదివారం భీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు బానోత్ రామారావు, నేతావత్ రాందాస్, గంగారాం నాయక్, గణేశ్ రాథోడ్, సుధాకర్ నాయక్, శ్రీకాంత్ నాయక్, దావుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని హీరాపూర్‌లో మాజీ ఎంపీ నగేశ్‌తో కలిసి జడ్పీ చైర్మన్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి చెందాయన్నారు. ఒకప్పుడు గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. అందుకే ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్‌ను దేశానికి నాయకుడు కావాలని ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గిరిజనులకు భవనాలు, కుమ్రం భీం స్మారక మ్యూజియం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్రం సుధాకర్, తాటిపెల్లి రాజు, విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తం, సర్పంచ్ రాధ, ఎంపీటీసీ లచ్చు, మాజీ సర్పంచ్ మర్సకోల తిరుపతి, సిద్ధం రాజేశ్వర్, సలీం, దావుల రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.