బేల,సెప్టెంబర్28 : మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు దహిగాం, గూడ, బెదోడ, అవల్పూర్, సిర్సన్న, టాక్లీ, బాది తదితర గ్రామాల్లోని మహిళలకు బుధవారం ఎంపీపీ వనితాఠాక్రేతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్‌ఠాక్రే, ప్రమోద్‌రెడ్డి, సతీశ్ పవార్, తన్వీర్‌ఖాన్, దేవీదాస్, ఆకాశ్ గుండావార్, విపిన్, సంతోష్ బెదుడ్కర్, ఐకేపీ ఏపీఎం రాజారెడ్డి, సీసీలు శరత్‌రెడ్డి, ప్రమోద్, మహిళలు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నారని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. భీంపూర్‌లోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మార్సెట్టి అనిల్, సర్పంచ్ మడావి లింబాజీ , ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు ఉత్తంరాథోడ్, దినేశ్ ఉన్నారు.
జైనథ్, సెప్టెంబర్ 28 : మండలంలోని లేకర్వాడ, మండగాడ, ఉమ్రి, మేడిగూడ తదితర గ్రామాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లేకర్వాడ సర్పంచ్ చంద మమత, నాయకులు విఠల్, మోహన్, మహేందర్‌రావు ఉన్నారు.
బజార్హత్నూర్, సెప్టెంబర్28 : మండలంలోని జాతర్ల గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాథోడ్ రాధ, సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ అందె సుజాత,ఎంపీటీసీ ఈశ్వర్, పంచాయతీ కార్యదర్శి నవనీత, గ్రామస్తులు నాగోరావ్, ప్రకాశ్, బలిరాం పాల్గొన్నారు.