
బేల, డిసెంబర్16: పంటసాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర అన్నారు. మండలంలోని చప్రాల గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డా రు. రైతులు పంట సాగు చేసే సమయంలో తప్పకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. శనగ, కంది పంటలో ఎండు తెగులు గమనించామన్నారు. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు, ప్లాంటోమైసిన్ 0.1 గ్రామ లీటరు నీటిలో మొదట్లో పోయాలన్నారు. పత్తిలో గులాబీ రంగు పురుగు, కాయ కుళ్లు నివారణకు సైపర్ మెథ్రిన్ , డెల్టామెథ్రిన్ మిల్లీ లీటరు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాము లు ప్లాంటోమైసిన్ 0.1 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పత్తి పంటను పొడిగించకుండా 180 రోజులలోపే తీసివేయాలన్నారు. కందిలో మచ్చల పురుగు, ఆకు మూడత పురుగు నివారణకు క్లోరోఫైసిపాస్ 2.5 మి. లీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నా రు. అదే విధంగా శనగలో శనగపచ్చ పురు గు , వేరుకుళ్లు, కాండపు కుళ్లు పై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఏఈవో లు రాజేశ్, నగేశ్, సర్పంచ్ దౌలత్ పటేల్, రైతులు ఉన్నారు.