
ఎదులాపురం, డిసెంబర్ 16 : స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కలిసికట్టుగా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి, జేజేబీ చైర్పర్సన్ ఎస్.మంజుల సూచించారు. ఆదిలాబాద్‌లోని బాల్క్ష్రక్ భవనంలో సీడబ్ల్యూ సీ, ఐసీపీఎస్, స్వచ్ఛంద సంస్థలు కలిసి గురువా రం సమీక్షా సమావేశం నిర్వహించాయి. ముం దుగా ఐసీపీఎస్, వివిధ స్వచ్ఛంద సంస్థల విధు లు, శిశు గృహ, బాలసదన్, సఖీ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ డీఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను రూపుమపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల నే అంశం పై చర్చించినట్లు చెప్పారు. జిల్లా కమిటీ సభ్యులు ఎన్జీవోస్ కేంద్రాలను తని ఖీ చేస్తుండాలని డీసీపీవో, ఇతర అధికారులకు ఆదేశించారు. బాలుర కోసం చైల్డ్‌కేర్ హోంను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ డీఎల్‌ఎస్‌ఏకు నివేదిక అందిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు డేవిడ్, సమీర్ ఉల్లాఖాన్, దశరథ్, జేజేబీ సభ్యులు ఝాన్సీ, నరేశ్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, బాలసదన్ సూపర్వైజర్ సరోజి, శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి, అర్బన్ స్కూల్ ఎస్వో ప్రశాంత్‌రెడ్డి, ఎల్‌పీవో రమేశ్, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ సిబ్బంది మంజుల, వీణ, వినోద్ పాల్గొన్నారు.