సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో కీలకమని.. భూమి, భుక్తి కోసం, దోపిడి, పీడన నుంచి విముక్తి కోసం విశేషంగా కృషి చేశారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేక్‌చౌక్ ప్రాంతంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 19 : సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివేక్‌చౌక్ ప్రాం తంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురా లు చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి సాయుధ రైతాంగ పోరా టంలో చాకలి ఐలమ్మ విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున ఐలమ్మ విగ్ర హాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలోని ధర్మసాగర్ వద్ద పటేల్ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మున్సిపల్ చౌరస్తాలో మొల్లకవయిత్రి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా చరిత్రకా రులను స్మరిస్తూ వారి అడుగుజాడల్లో పయని స్తున్నదని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారు గొండ రాము, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, నాయకులు ముడుసు సత్యనారాయణ, అడ్ప పోశెట్టి, కోటగిరి అశోక్, ధర్మాజీ శ్రీనివాస్, రజక కుల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన గిరిజన నాయకులు..
నిర్మల్ నియోజకవర్గానికి చెందిన గిరిజనులు సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాద పూర్వ కంగా కలుసుకున్నారు. సీఎం కేసీఆర్ గిరిజను లకు రిజర్వేషన్లను పది శాతం పెంచినం దుకు, గిరిజన బంధు ప్రకటించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. గాయిద్పెల్లి సర్పంచ్ రాందాస్, ఉప సర్పంచ్ విజేశ్, శ్యాంరావు, భీంరావు, ముకుంద్‌రావు, గోవింద్రావు, అశోక్, తదితరులున్నారు.
పరిశోధనలపై దృష్టి సారించాలి
విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగం, పరిశోధనలపై దృష్టి సారించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవార్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్వాలిటీ సొల్యూషన్ వారి స్టీమ్ ల్యాబ్‌ను మంత్రి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్‌కు సంబందించిన పలు విషయాలు ఈ ల్యాబ్ ద్వారా నేర్చుకునే మంచి అవకాశం విద్యా ర్థులకు దక్కిందని పేర్కొన్నారు. పలు అంశాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచిం చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారప్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఈవో రవీందర్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ సుబ్రమణ్య శర్మ, నిషాజోషి, హెచ్ఎం జాఫర్ మోహినొద్ద్దీన్, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.