ఎదులాపురం,సెప్టెంబర్16: రాష్ట్ర కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని దళిత సంఘాలనేతలు, ప్రజాప్రతినిధులు స్వాగతిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎమ్మెల్యే జోగు రామన్నకు టీఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్నకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న జై భీమ్… జై కేసీఆర్ అంటూ నినదించారు. ఢిల్లీలో నిర్మించే నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్, అధికార ప్రతినిధి నక్క రాందాస్, మాతంగ్ శక్తి జిల్లా అధ్యక్షుడు జాదవ్ సాంబశివ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీ నారాయణ, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్, జిల్లా ప్రధానకార్యదర్శి జువ్వాక నర్సింహులు, గంగాధర్, ముక్కెర అశోక్, రమేశ్, రవి పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ పట్టణం విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దళిత వర్గాలతోపాటు అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతున్నదని టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు దివీటి రాజు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, ప్రశాంత్, శైలేందర్ వాగ్మారే, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపా రాణి, ప్రధాన కార్యదర్శి బీ మమత ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు రత్నజాడే ప్రజ్ఞకుమార్, దళిత సంఘా ఆధ్వర్యంలో భుక్తాపూర్‌లోని మహా ప్రజ్ఞబుద్ధ విహార్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముందుగా బుద్ధుడి విగ్రహానికి వందనం సమర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. వివిధ సంఘాల నాయకులు మధు భావల్కర్, రమాబాయి, ఖుష్వర్తా లాండ్గే, నాయకులు సురేందర్ లాండ్గే, రాజు మస్కే, రాజు పటాడే, ప్రమోద్ముడే ఉన్నారు.
లోకేశ్వరం, సెప్టెంబర్ 16 : కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడంపై మన్మధ్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సంఘం భవనం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ లలిత, భోజన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సింగిల్‌విండో చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు, వెంకట్ రావు, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్ , శేఖర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
దస్తురాబాద్,సెప్టెంబర్16: బుట్టాపూర్‌లో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మునేసుల శైలేందర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ సింగరి కిషన్, సర్పంచ్ బాదం నిరోషా, నాయకులు బాదం శ్రీనివాస్, కారొబార్ అంజన్న, గంగన్న, శేఖర్, అంజన్న, శంకర్, రాజేందర్, రాకేశ్, రాము,రవి పాల్గొన్నారు.