ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 16 : జాతీయ సమైక్యతను కాపాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయనతో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన 15వేల మంది విద్యార్థులు, ప్రజలు, అతిథులు జాతీయ జెండాలను చేతపట్టుకొని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ చౌక్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జడ్పీచైర్మన్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జాతీయ స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజలు కులమతాలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మొదటి రోజు 15వేల మందితో ర్యాలీ విజయవంతంగా నిర్వహించామన్నారు. మరో రెండు రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 17వ తేదీన ఉయదం 9 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. ఉదయం 9గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. 18న పట్టణంలోని సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అదనపు ఎస్పీ సుమయ్జాన్ రావ్, డీఎస్పీ ఉమేందర్, ఎంపీపీలు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 16 : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సమైక్యతకు పాటుపడుతున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బోథ్‌లో సాయిబాబా ఆలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆనాడు నిజాం నవాబుల చెర నుంచి విముక్తిపొందిన తెలంగాణ ప్రాంతం నేడు కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశంలోనే గుర్తింపు పొందిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపెడుతూ ప్రభుత్వం రుణం తీర్చుకుంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు ఎస్పీ శ్రీనివాస్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, సీఐ నైలు, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొండ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
జైనథ్, సెప్టెంబర్ 16 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు జైనథ్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తరలివెళ్లారు. ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు వాహనాల్లో బయలుదేరారు.
నేరడిగొండ, సెప్టెంబర్ 16 : బోథ్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల ర్యాలీలో పాల్గొనడానికి నేరడిగొండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి జడ్పీటీసీ జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు వాహనాల్లో వెళ్లారు. వెళ్లిన వారిలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నానక్‌సింగ్, నాయకులు శంకర్, గులాబ్‌సింగ్, యువకులు, కార్యకర్తలు ఉన్నారు.
భీంపూర్, సెప్టెంబర్ 16 : మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోథ్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల ర్యాలీకి తరలివెళ్లారు. వెళ్లిన వారిలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు నరేందర్‌యాదవ్, కిరణ్‌యాదవ్, కపిల్, వైభవ్ కార్యకర్తలు ఉన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 16 : ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో ఉట్నూర్ టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమ్, వైస్ ఎంపీపీ బాలాజీ, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 16 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నార్నూర్ మండలం జామాడ, గాదిగూడ మండలం ఝరి గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలబాలికల పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నెహ్రూ, కోట్నాక్ రాజేశ్వర్, సర్పంచ్‌లు మడావి ముక్తారూప్దేవ్, మోతుబాయి, పంచాయతీ కార్యదర్శులు జాడి రాధిక, సునీల్‌కుమార్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 16 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. వినాయక్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు జాతీయ, తెలంగాణ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేశవులు, సువర్ణ, శ్రీలత, గణేశ్, వినోద్, లక్ష్మణ్, దినేశ్‌రెడ్డి, తిరుపతి, సాంబరాజు, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.