కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో అంతర్జాతీయంగా మంటగలుస్తున్న దేశ పరువు నిలువాలన్నా.. విశ్వవేదికలపై మన ప్రతిష్ట పెరగాలన్నా.. విద్యతోనే సాధ్యమవుతుంది. అందుకోసం దేశ విద్యారంగం ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. విద్యావ్యవస్థపై పూర్తి అవగాహన ఉజ్వల భారత్‌కు ఏదైనా చేయాలనే సంకల్ప బలం ఉన్న నాయకుడు కేసీఆర్‌తోనే అవుతుందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వినూత్న సంస్కరణలు తేవడంతోపాటు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రోత్సాహం అందిస్తే దేశం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని, ఇది జరగాలంటే తెలంగాణలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషి దేశవ్యాప్తం కావాలని పేర్కొంటున్నారు. కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన గురుకులాలు, ప్రాథమిక విద్యారంగంలో మౌలిక సదుపాయాల కోసం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’, ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, కొత్త జోనల్ వ్యవస్థ.. వంటి విప్లవాత్మక మార్పులు ఉజ్వల భారత్ నిర్మాణానికి అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల పాలనలో సంక్షేమం, సాగునీరు, విద్యుత్ రంగాలల్లో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. విద్యారంగంలో పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. అన్ని వర్గాల పేద బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో గురుకులాలను నెలకొల్పగా.. భారీ స్పందన వస్తుండడంతో యేటా పెంచుతూ పోతున్నారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర సర్కారు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది. విద్యారంగంలో గురుకులాలు కొత్త చరిత్రకు నాంది పలికాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేట్ బాట వీడి గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారంటే.. వీటిని ఏ స్థాయిలో అభివృద్ధి పర్చారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా.. వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ధి పొందుతున్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 12: పాలన గాడి తప్పినపుడు సామాన్యులు, మేధావులు సహజంగానే మార్పు ఆశిస్తారు. దేశంలో ధరల భారం సామాన్యుడు మోయలేక పోతున్నాడు. జాతీయ స్థాయిలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. రాష్ర్టాలతో సమన్వయం లేకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి సమర్థులు రావడం అనేది అవసరం. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతటికీ ఆయన ఉపయోగపడు తారు.. రాష్ట్రంలో సర్కారు బడులకు వెలుగు వచ్చిన మాట నిజం. మా ప్రాథమికోన్నత పాఠశాలలోనే 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ఊరు మన బడి ప్రణాళిక అమలుతో ఫలితాలు మంచిగ వచ్చాయి. ఏదేమైనా ఉజ్వల భారత భవిష్యత్ కోసం తెలం గాణ నుంచి ఒక మంచి నాయకుడు కేంద్రంలో పాగా వేస్తే మనకు అంతకన్నా శుభం ఏముంటది. సామాన్యుడికి, రైతులకు ఏం చేయాల్నో కేసీఆర్‌కు తెలిసినంతగా ఏ నాయకుడికి తెలియదు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో పెను మార్పు తప్పదు. దక్షణా ది రాష్ర్టాలు సత్తా చాటాలంటే ఇదే మంచి సమయం. తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరి ఆశీస్సులు సీఎం కేసీఆర్‌కు ఉంటాయి. దేశంలో మార్పు తీసుకొచ్చే శక్తి కేసీఆర్‌కే ఉంది.
– శ్రీకాంత్ ,హెచ్ఎం,( టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు),అంతర్గాం, యూపీఎస్, భీంపూర్ మండలం
కోటపల్లి, సెప్టెంబర్ 12 : తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే తిరుగులేని శక్తిగా తయారు చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరముంది. ఇందుకోసం యావత్ దేశ ప్రజానీకం ఎదురు చూస్తున్నది. వ్యవసాయం విద్య, వైద్యం రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం పథకాలను పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చిన్న జిల్లాలతో పాలన సులభతరం అవుతుందనే ఉద్దేశంతో 10 జిల్లాలను 33 జిల్లాలుగా వీకేంద్రికరించి సక్సెస్ సాధించారు. అలాంటి ముఖ్యమంత్రి ప్రధాని అయితే దేశంలో మరిన్ని కొత్త రాష్ర్టాలు ఏర్పడడం ఖాయం. రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబీమా, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, వ్యవపాయానికి ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నూతన గురుకులాల ఏర్పాటులాంటివి దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ తప్పనిసరిగా దేశ రాజకీయాలకు వెళ్లాలి.
– అంజన్‌కుమార్, ఉపాధ్యాయుడు, కోటపల్లి
నిర్మల్,సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచిన ధీశాలి. అసాధ్యమనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే ఉన్నతంగా నిర్మించి రైతురాజ్యం స్థాపించిన కార్యశీలి కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతున్న దార్శనికుడు సీఎం కేసీఆర్. మన రాష్ట్రంలోని అనేక పథకాలను ఇతర రాష్ర్టాలే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కాపీ కొడుతున్నది. ఇలాంటి సందర్భంలో ప్రజల అభివృద్ధిపై పరిపూర్ణ అవగాహన ఉన్న నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను స్వాగతిస్తున్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతున్నది.
-గంగుల చిన్నన్న, ఉపాధ్యాయుడు, తానూర్
నిర్మల్,సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ):దేశంలో మతసామరస్యం వర్ధిల్లాలన్నా , ఆమెరికా, చైనా దేశాల మాదిరిగా మన దేశం కూడా అభివృద్ధి చెందాలన్నా సీఎం కేసీఆర్ లాంటి నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఎందరో మాటలతో అవమానించినప్పటికీ అవేమి పట్టించుకోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ తెచ్చారు. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి దేశంలోనే మన రాష్ర్టాన్ని అగ్ర భాగాన నిలిపారు. తెలంగాణ మాదిరిగా భారతదేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా ఆయనకు అండగా ఉంటుంది. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణిస్తారనే నమ్మకం నాకు ఉంది.
-జీ చంద్రశేఖర్, తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
నిర్మల్,సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ):సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు గుణాత్మకమైన విద్య అందుతున్నది. గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. తెలంగాణ రాకముందు మా జీతం కేవలం రూ.15 వేలు ఉండే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జీతాలు పెంచారు. ప్రస్తుతం రూ.32,500 తీసుకుంటున్నాం. మాలాగే దేశంలోని ఉద్యోగులు కూడా బాగుపడాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. ప్రధాని కావాలి. దేశమంతా ఆయన పాలనను ఇప్పటికే మెచ్చుకుంటున్నది. రైతులు బ్రహ్మరథం పడుతున్నారు. నాకు తెలిసి కేసీఆర్ కంటే మంచి నాయకుడు దేశ రాజకీయాల్లో లేడు. తెలంగాణను సస్యశ్యామలం చేసినట్లే దేశం మొత్తానికి మంచి చేస్తారనే నమ్మకం ఉంది.
– డీఎల్.సునీతారాణి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, మస్కాపూర్
బెల్లంపల్లి రూరల్, సెప్టెంబర్ 12 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో పేదింటి కుసుమాలు ప్రతిభ చూపేలా ప్రత్యేక శిక్షణాలయాలను ఏర్పాటు చేశారు. కేజీ టూ పీజీ మిషన్ దేశానికే ఆదర్శనీయమైనది. మన విద్యా విధానం ఇతర రాష్ర్టాల అధికారులను సైతం ఆకర్షిస్తుంది. గతేడాది బెల్లంపల్లి గురుకులానికి బీహార్ నుంచి అధికారులు వచ్చి ప్రణాళికలను తెలుసుకొని వెళ్లారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా ప్రస్తుత విద్యా విధానం ఉంది. తెలంగాణలోని విద్యావిధానం దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– ఐనాల సైదులు, ప్రిన్సిపాల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెల్లంపల్లి