ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 11 : ఖానాపూర్ పట్టణ సమీపంలోని ఇక్బాల్‌పూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్‌పై భారీ వట వృక్షం పడింది. దీంతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన డ్రైవర్ బుచ్చిరాజం, రవి అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన 13 మంది యువకులు, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని వీక్షించేందుకు బయల్దేరారు. ఖానాపూర్ సమీపంలోని ఇక్బాల్‌పూర్ సమీపంలోకి రాగానే, ఒక్కసారిగా వాహనంపై వృక్షం పడింది. అందులోని డ్రైవర్ బుచ్చిరాజం, పక్కనే కూర్చున్న రవి అక్కడికక్కడే మృతిచెందారు. అందులోనే ఉన్న మరో యువకుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్‌పల్లికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు, పోలీసులు జేసీబీ సాయంతో వా హనాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సోన్, సెప్టెంబర్ 11 : కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన విక్రమ్ (31) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. భార్య, పిల్లలు, స్నేహితుడితో కలిసి విక్ర మ్ హైదరాబాద్ నుంచి ఉదయం కారులో స్వ గ్రామానికి బయల్దేరాడు. కామారెడ్డి వద్దకు రా గానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. విక్రమ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
తానూర్, సెప్టెంబర్ 11 : బోంద్రట్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమదంలో రాజేందర్(26) మృతి చెందినట్లు ఎస్ఐ పీ శ్రీనివాస్ తెలిపారు. మహారాష్ట్రలోని భోకర్ తాలుకా బెంబర్ గ్రామానికి చెందిన రాజేందర్, సునీల్ బైక్‌పై భైంసాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టారు. రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సునీల్‌ను భైంసా దవాఖానకు తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు.