గుడిహత్నూర్, నవంబర్ 9: సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బొర్రమద్ది గ్రా మంలో మంగళవారం ఆదివాసుల ఆత్మీయ సమ్మేళన కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అ న్ని వర్గాల ప్రజలు సంతోషమే లక్ష్యంగా సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కుల మత భేదాలు లేకుండా అన్ని మతాల వారి పండుగలకు నిధులు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించగా, రోడ్డు, అంగన్వాడీ భవనం నిర్మాణం త్వరలోనే మంజూరు చేసి పనులు జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రజలు ఘనస్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనంద్, ఉమ్మడి జిల్లా కో శాధికారి బూర్ల లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ శగీర్ఖాన్, సర్పంచ్ ప్రభాకర్, నాయకులు జంగు, జలంధర్, సతీశ్, లక్ష్మణ్, దిలీప్, గ్రామ కమిటీ అధ్యక్షుడు, సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యా ర్డ్లో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ… ఈఏడాది పత్తికి మంచి గిట్టు బాటు ధర ఉంద ని, సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీ నిమ్మల ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ ఏనుగుల కృష్ణా రెడ్డి, సర్పంచ్ సునీత, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, డిప్యూ టీ తహసీల్దార్ రామారావ్, నాయకులు పాల్గొన్నారు.