ఆసిఫాబాద్, సెప్టెంబర్9 : ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మె ల్యే కోన ప్ప, అదనను కలెక్టర్ చాహత్బాజ్బాయ్, డీఆర్వో కదం సురేశ్‌తో కలిసి వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేసి 15 వేల మంది తో ర్యాలీ చేపడుతామన్నారు.
జిల్లాకేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌక్ నుంచి నూతన కలెక్టరేట్, కుమ్రం భీం చౌక్ నుంచి ఐదు రూట్లలో ర్యాలీ తీసి పీటీజీ పాఠశాల మైదానానికి చేరుకునేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా అందరికి భోజన వసతి కల్పించాలన్నారు. 17న జిల్లా కేంద్రంలోని జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అలాగే హైదరాబాద్‌లో చేపట్టనున్న 5 వేల మంది షెడ్యూల్డ్ తెగల వారు పాల్గొనేందుకు సంబంధిత అధికారులు జాబితాను సిద్ధం చేసి ప్రతి మండలం నుంచి బస్సులు ఏర్పాటు చేసి ఆ యా మండలాల పరిధిలో కార్యదర్శులను నియమించాలన్నారు.
18న సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆదివా సీ భవన్లో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నా రు. జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు, కవు లు, ప్రముఖ కళాకారుల జాబితా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.