నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణ రావు రచనలు ఎందరికో స్ఫూర్తి నింపాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కాళోజీ జయంతి నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ హెల్త్ యూ నివర్శిటికీ కాళోజీ పేరు పెట్టి ఆయనకు గుర్తింపు ఇచ్చిందన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, తహసీల్దార్లు శివప్రసాద్, సుభాష్ చందర్, నాయకులు రాంకిషన్‌రెడ్డి ఉన్నారు.
ఎదులాపురం,సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తెలంగాణ భాష, యాస వ్యాప్తి చెందేలా రచనలు చేసి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన గొప్పకవి అని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్లో కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కవి, రచయిత కాళోజీ నారాయణరావు, తెలంగాణ కీర్తిని నలు దిశలా చాటి చెప్పారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన రచనలు ఎంతగానో స్ఫూర్తి నింపాయని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. కాళోజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాల వారికి అందించాలన్నారు.
ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు, డీపీఆర్వో ఎన్ భీమ్ కుమార్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకురాలు వర్ణ, స్వాతి, నలందాప్రియా, రాజేశ్వర్, పలు శాఖ సిబ్బంది ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఎస్పీ శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం, కవిత్వం రాసిన ప్రజాకవి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభు త్వం ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ గౌరవిస్తున్నదని చెప్పారు. పర్యవేక్షణఅధికారి యూనుస్ అలీ, సూపరింటెండెంట్ జోసెఫిన్, సీసీ దుర్గం శ్రీనివాస్, గిన్నెల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.