నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 4 : నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాలు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడితో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, వార్డుల్లో ఏర్పాటుచేసిన విగ్రహాలను శోభాయాత్రగా తీసుకెళ్లి వినాయసాగర్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, డైరెక్టర్లు లింగారెడ్డి, సలీం, రమేశ్, నర్సాగౌడ్, చరణ్ పాల్గొన్నారు. నిర్మల్ బ్లడ్ క్లబ్ ఆధ్వర్యంలో గణేశ నిమజ్జనాన్ని నిర్వహించారు.
భైంసాటౌన్, సెప్టెంబర్ 4 : మండలంలోని కామోల్, హంపోలి (కే)లో ఆదివారం గణేశ్ నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథులను శోభాయాత్రగా తరలించారు. స్థానిక చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
ముథోల్, సెప్టెంబర్ 4 : మండలంలోని ఆష్టా, విఠోలి, తరోడా, చించాల గ్రామాల్లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగింది. ఐదురోజుల పాటు పూజలు చేసిన భక్తులు ఆదివారం నిమజ్జనోత్సవానికి తరలించారు. ఆయా గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఐ వినోద్, ఎస్ఐ తిరుపతి బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనం
లోకేశ్వరం, సెప్టెంబర్, 4 : లోకేశ్వరం మండలంలోని బామ్ని (కే), జోహార్‌పూర్, హవర్గ గ్రామాల్లోగణనాథుల నిమజ్జన వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.