ఎదులాపురం,ఆగస్టు 28: మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని రణదివ్యానగర్లో ఆదివారం అన్నాబావుసాఠే జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న స్థానిక నాయకులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దళిత వర్గాలను చైతన్యపరిచిన మహనీయుడు అన్నాబావు సాఠే అని కొనియాడారు. ఉన్నత లక్ష్యాలకు పేదరికం ఎప్పుడూ అడ్డు రాదన్నారు. అన్నాబావుసాఠే పేద కుటుంబంలో జన్మించినా ఆయన చేసిన కృషి, పట్టుదల సమాజ మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. దళిత వర్గాల చైతన్యంతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో స్ఫూర్తిని నింపారని చెప్పారు. తన రచనలతో సమాజంలో ఎంతో మార్పు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వార్డు కౌన్సిలర్ కోవ రవి, వెంకటేశ్, కాంబ్లే ముఖిత్ పాల్గొన్నారు.
జాతిని మేల్కొల్పిన సాఠే రచనలు
కుభీర్, ఆగస్టు 28 : యావజ్జాతిని తన రచనలతో మేల్కొల్పిన మహోన్నత వ్యక్తి అన్నాబావుసాఠే అని , ఆయన సమాజం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని హల్దా గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. సర్పంచ్ సాయన్న, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, మాజీ సర్పంచ్ కూనింటి దేవేందర్, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మాజీ ఎంపీటీసీ వీ మోహన్, నాయకులు సంజయ్ చౌహాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దిగంబర్ పటేల్, మాదిగ సంఘం మండల అధ్యక్షుడు గాడేకర్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ప్రారంభం
లోకేశ్వరం, ఆగస్టు 28 : మండలంలోని బిలోలి గ్రామంలో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ముందు గా స్థానిక సీతారామాలయంలో నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, సర్పంచ్ సవితా నర్సింగ్ రావు, ఎంపీటీసీ విజయసాయారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు, మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సర్పంచ్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుజంగ్ రావు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.