నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా ఏర్పాటుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోణార్క్ ఎన్బీఆర్, లలితా మల్టీ స్పెషాలటీ వైద్యశాలలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఏర్పాటుతో వైద్య రంగం విస్తరించిందని, గతంలో చిన్నపాటి శస్త్రచికిత్సకు నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఇప్పుడు నిర్మల్‌లోనే కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాల పనులు కొనసాగుతున్నాయని, మెడికల్ కళాశాలతో పూర్తిగా ఇబ్బందులు దూరమవుతాయన్నారు. అనంతరం ఆయా వైద్యశాలల నిర్వాహకులు మంత్రిని సన్మానించారు.
మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ పాలక వర్గం
నిర్మల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని క్యాం పు కార్యాలయంలో కలిశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్‌తో పాటు 16 మంది డైరెక్టర్లకు జీవో పత్రాన్ని మంత్రి అందజే శారు. ఈనెల 28న పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మంత్రి తెలి పారు. అనంతరం మంత్రిని వారు సత్కరించారు. కార్యక్రమాల్లో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఖానాపూర్ ఎమెల్యే రేఖా నాయక్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కోణార్క్ ఎన్బీఆర్ వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ సుభాష్ రావు, కృష్ణమోహన్ గౌడ్, దిగంబర్ రావు, వైద్యులు అప్పాల చక్రధర్, రమేశ్ రెడ్డి, రమణా గౌడ్, లలిత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ మహేశ్ బాబు, డాక్టర్ లలిత, పీ జితేందర్, నర్సాగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ఉన్నారు.
ఆర్థికారోభివృద్ధికి చేయూత
నిర్మల్ టౌన్, ఆగస్టు 25 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో రూర్బన్ పథకంలో భాగంగా నాప్కి న్ తయారీ కేంద్రంలో రూపొందించిన నాప్కిన్లను అందించారు. నాప్‌కిన్‌కు రేల అని నామకరణం చేసినట్లు తెలిపారు. కుంటాల మండల కేంద్రంలో రూ. 50లక్షలతో మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.