15 రోజులపాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిసాయి. ఇంటింటా జాతీయ జెండాల రెపరెపలు.., ఊరూవాడా, పట్టణ పురవీధులు, రహదారుల వెంట భారీ జెండాలతో ర్యాలీలు, కవి సమ్మేళనాలు, రంగవల్లులు, హరితహారాలు, ఆటలపోటీలతో ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగేలా వేడుకలు ఘనంగా సాగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ముగింపు ఉత్సవాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
భీంపూర్/ఇంద్రవెల్లి, ఆగస్టు 22 : తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి మండలాల నుంచి జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, భీంపూర్ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్లు మేకల నాగయ్యయాదవ్, అరుణ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఇంద్రవెల్లి ఎంపీపీ శోభాబాయి, ఎంపీటీసీలు రాజేశ్వర్, జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, సర్పంచ్లు కోరెంగా గాంధారి, రాథోడ్ శారద, విజయ, టీఆర్ఎస్ నాయకులు నరేందర్యాదవ్, కృష్ణ, రాథోడ్ ఉత్తమ్, రఘు, రమణ తదితరులు తరలివెళ్లారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22 : నిర్మల్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. వెళ్లిన వారిలో అధికారులతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏ సీఎస్ చైర్మన్లు ఉన్నారు.