కడెం, ఆగస్టు 17: భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతంగా వెళ్లడంతో వా గుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి, నిర్మల్-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్అండ్బీ అధికారులు తాత్కలిక మరమ్మతు చేపట్టారు.
ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయినట్లు ఆర్అండ్బీ డీఈ మల్లారెడ్డి తెలిపారు. దీంతో బుధవారం నుంచి నిర్మల్-మంచిర్యాల జిల్లాల మధ్య రాకపోకలను ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలతో పాటు, ఆటోలు, కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. బస్సు, లారీ, భారీ ట్రక్కులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి అన్ని వాహనాలను అనుమతించేలా పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.