హాజీపూర్, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి దుర్గం ఎమ్మెల్యే చిన్నయ్య, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ 88వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, 1969 నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు బంగారు తెలంగాణతోనే సాధ్యమని ఉద్యమానికి రూపకల్పన చేశారన్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తితో స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలో..
మంచిర్యాలటౌన్, ఆగస్టు 6: జీవితాంతం స్వరాష్ట్ర సాధన కోసం తపించిన గొప్ప వ్యక్తి, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కొనియాడారు. జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఎమ్మెల్యే నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక మార్గమని నమ్మి అందుకోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సార్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..
మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, సురేశ్ బల్దవా, ప్రకాశ్‌నాయక్, మినాజ్, పోరెడ్డిరాజు, నాయకులు సత్యపాల్‌రెడ్డి, సుంకరి రమేశ్, తాజుద్దీన్, నగేశ్, తదితరులు సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్ పట్టణంలో..
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీ మల్లికార్జున్ యాదవ్‌లతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీసీపీవో కార్యాలయంలో డీసీపీవో మహేశ్, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో అధ్యక్షుడు కర్ణ గౌడ్, పలు విద్యాలయాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు జయశంకర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో సీఈవో రత్నమాల, ఎంపీడీవో శశికళ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, వైస్ చైర్మన్ రుకుం ప్రహ్లాద్, సర్పంచ్‌లు భీమేశ్, బాబురావు, నాయకులు సుంకరి పెంటు, శ్రీనివాస్, రాము గౌడ్, నిసార్, మునీర్, విశ్రాంత ఉద్యోగులు మధుసూదన్ గౌడ్, శంకర్, రాజయ్య, ఆయా కార్యాలయాల సిబ్బంది తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్లో..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్లో చిత్రపటం వద్ద కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ భాజ్పాయితో కలిసి నివాళులర్పించారు. 1969 నుంచి సాగిన స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి జయశంకర్ సార్ రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేశ్, తహసీల్దార్ ఎజాజ్ ఖాన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.