ఎదులాపురం, ఆగస్టు 5 : దేశభక్తి పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పేర్కొ న్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వజ్రోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సన్నాహాక కమిటీ సమావేశం శుక్రవా రం జడ్పీ చైర్మన్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవే యా లని, ప్రతి ఇంటికి జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల పట్టణ స్థ్ధాయిల్లో ఈ నెల 8 నుంచి 21వ తేదీ వరకు వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 8న సీఎం కేసీఆర్ చేతుల హైదరాబాద్లో ప్రారంభిస్తారని 9న ప్రతి ఇంటికి జాతీయ జెండాలను పంపిణీ చేయాలని సూచించారు. 10న వనమహోత్సవం భాగంగా ప్రీడం పార్కుల ఏర్పాటు, 11న పోలీస్, యువజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఫ్రీడమ్ రన్ నిర్వహణ, 12న జాతీయ సమైక్యతా రక్షా బంధన్ కార్యక్ర మాలను నిర్వహించాలన్నారు.
13న జెండా, ప్లకార్డులలో ఎన్సీ సీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీ లు, సమ్మేళనాలు, 14న నియోజకవర్గ కేంద్రాల్లో డీపీఆర్వో సమన్వయంతో తెలంగాణ సాంస్కృతిక సారథి జానపద కళాకా రుల ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. 15న ఘనంగా స్వాతం త్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, 16న తెలంగాణ రాష్ట్ర సామూహక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17న జిల్లా వైద్యారోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్ధల సమన్వయంతో రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. 18న క్రీడ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడం కప్ మండల, జిల్లా స్ధాయిలో ఉద్యోగులు, యువతతో క్రీడల నిర్వహణ, 19న దవాఖానలు, జైల్లు, అనాథ, వృద్ధ్దాశ్ర మాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలన్నారు.
20న పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో రంగోలి, 21న జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లా డుతూ వజ్రోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివా స్, డీపీఆర్వో భీమ్ కుమార్, కమిషనర్ శైలజ ఉన్నారు.