హాజీపూర్, జూలై 29 : ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపు చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. శుక్రవారం మంచిర్యాల కేంద్రంలోని వైశ్యభవన్‌లో రామగుండంలోని ఎన్టీపీసీ సంస్థ జీఎం ప్రసేంజిత్ పాల్ ఆధ్వర్యంలో ఉజ్వల్ భవిష్య విద్యుత్ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవసరమైనంత మేరకే విద్యుత్‌ను వినియోగించాలన్నారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటల సాగు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఎన్టీపీసీ జీఎం మాట్లాడుతూ అంతర్గత విద్యుత్‌శక్తి అభివృద్ధి వ్యవస్థ ద్వారా పట్టణాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ట్రాన్స్ఫార్మర్ లైన్లు, సబ్ స్టేషన్లకు మెరుగైన వసతులు సమకూర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓన్టీపీసీ ఇంజినీర్లు వంశీకృష్ణ, ఆదిత్య, చిరంజీవి, మంచిర్యాల చైర్పర్సన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాడి పరిశ్రమ యూనిట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
హాజీపూర్, జూలై 29 : దళిత బంధు పథకం ద్వారా పాడి పరిశ్రమ యూనిట్‌ను ఎంపిక చేసుకొని ఉపాధి పొదాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. దళితబంధు -పాడి పరిశ్రమ సంబంధిత పోస్టర్‌ను పశు సంవర్ధక శాఖ సంచాలకుడు శంకర్‌తో కలిసి కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ను త్వరగా అందించాలి
వరిధాన్యం సంబంధిత రబీ పంట 2020-21, 2021-22 సీఎంఆర్లు ప్రభుత్వానికి త్వరగా అందించాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి భారత ఆహార సంస్థ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.