బజార్హత్నూర్, జూలై 25 : ప్రజలు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని బజార్హత్నూర్ పీహెచ్సీ వైద్యాధికారి సురేశ్ సూచించారు. మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నారమ్మ, హెల్త్ అసిస్టెంట్ గాజుల రమేశ్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
బోరిగామ గ్రామంలో ఇచ్చోడ ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి ఆకుదారి సాగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించారు. జలుబుతో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. వానకాలంలో తీసుకునే జాగ్రత్తలు సలహాలు ఇచ్చారు. పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట అరుంధతి సురేందర్‌రెడ్డి, కౌసల్య రమేశ్, హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాస్, సుభాష్, రాజ్‌కిరణ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఇంద్రవెల్లి పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని అందునాయక్తండాలో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరలపై సర్వే చేశారు. శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, పీహెచ్ఎన్ జ్యోతి, ఏఎన్ఎం వచ్చల, హెల్త్ అసిస్టెంట్ బలరాం, ఆశ కార్యకర్త కమలాబాయి పాల్గొన్నారు.
మండలంలోని కొత్తపల్లి(హెచ్), కోలాంగూడ గ్రామాల్లో వైద్య సిబ్బంది ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. 46మందికి వైద్య పరీక్షలు చేసి రక్త నమూనాలు సేకరించారు. నలుగురికి జ్వరం వచ్చినట్లు గుర్తించి మందులు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ హెచ్‌ఈవో చౌహాన్ నాందేవ్, హెల్త్ అసిస్టెంట్లు ఈశ్వర్, గోకుల్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై కళాజాత
మండలంలోని చాందొరి, హస్నాపూర్, దంతన్‌పల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతి సారిథి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సి జాగ్రత్తలపై కళాజాత నిర్వహిం చారు. కార్యక్రమంలో నగేశ్, మోహన్‌నాయక్, శంకర్, పురుషోత్తం, గోవింద్‌రావ్, రామచంద్ర పాల్గొన్నారు.