ఎదులాపురం, జూలై 25: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాఖల సమన్వయంతో పారిశుధ్య కార్యక్రమాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని మంత్రి టీ.హరీశ్‌రావు ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని, అన్ని పాథమిక ఆరోగ్య కేంద్రాలు, దవాఖానల్లో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బూస్టర్ డోసు అందించాలన్నారు. మంకీ ఫాక్స్ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఫీవర్ ఆస్పత్రిని నోడ్‌ల్ ఆస్పత్రిగా గుర్తించామని, అనుమానిత కేసులను అక్కడికి తరలించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా వేడి నీటిని తాగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహించాలన్నారు.
బీసీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం డ్రై డే కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, డీఎంవో శ్రీధర్, ఫుడ్ సెక్యూరిటీ అధికారి ప్రత్యూష, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సునీత, రాజలింగం, కృష్ణవేణి, దిలీప్, డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
సీజనల్ వ్యాధులపై ముందస్తుగా అవగాహనలు కల్పించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో పాటు డ్రైడే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రుల బృందంతో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో శ్రీలత, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వర్‌గౌడ్, ఈడీ హన్మాండ్లు, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీఎల్పీవో శివప్రసాద్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.