కుభీర్, జూలై 24 : భైంసాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం కుభీర్ మండల టీఆర్ఎస్ నాయకులతో కలిసి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి బాధితులకు అంద జేశారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ సిద్ధ్దం వార్ దామాజీ గతేడాది అనారోగ్యంతో మరణిం చారు. ఆయన వైద్య చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆయన కుమారుడు సిద్ధ్దం వార్ వివేకానంద్ స్థానిక టీఆర్ఎస్ నాయ కులతో కలిసి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి విన్నవించారు.
ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు మంజూరు చేయించారు. సిద్ధంవార్ సదానంద్ కరోనా బారిన పడడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు. దీంతో ఈయనకు సీఎంఆ ర్ఎఫ్ నుంచి రూ.2.5 లక్షలు మంజూరు చేయిం చారు. ఈ సందర్భంగా వివేకానంద్, సదానంద్ సీఎం కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి కృతజ్ఞ తలు తెలిపారు. ఎంపీపీ తూము లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ గంగా చరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, సర్పం చ్ల ఫోరం మండలాధ్యక్షుడు న్యాలపట్ల దత్తు గౌడ్, టీఆర్ఎస మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, సంజ య్ చౌహాన్, మాలేగావ్ సర్పంచ్ మహిపా ల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జీ బాబు, కే అరవింద్, దొంతుల గంగాధర్ ఉన్నారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి
భైంసా, జూలై 24 : గౌడ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ తాలుకా అధ్యక్షుడిగా ఎన్నికైన గర్గుల మురళీగౌడ్‌ను ఆదివారం ఎమ్మెల్యే పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి భోజా రాం, వాసే, ప్రసన్నజిత్ ఆగ్రే పాల్గొన్నారు.