
భీంపూర్, సెప్టెంబర్ 21: మండలంలోని మారుమూల సరిహద్దు గ్రామాలకు ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బంది వాగులు దాటి వెళుతూ వ్యాక్సి నేషన్ చేస్తున్నారు. ప్రతి పంచా యతీలో సర్పంచ్‌లు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అర్హులంతా కొవిడ్ టీకాలపై ఆసక్తి చూపుతు న్నారు. మంగళవారం కరంజి (టీ) ఉపకేంద్ర ఏఎన్ఎం సుజా త, ఆశ కార్యకర్తలు రోజా, సంగీ త, జయమాల, రేఖ వర్షంలోనూ 11 కిలోమీటర్లు నడక సాగించా రు. వాగు దాటి గుట్టమీది గిరిజన గ్రామాలు టేకిడి రాంపూర్‌లో 270 మందికి , కొజ్జన్గూడలో 290 మందికి టీకాలు వేశారు. అలాగే అర్లి(టీ), అందర్‌బంద్, భీంపూర్ ఉపకేంద్రాల పరిధిలో నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కార్యదర్శులు నితిన్, సందీప్ , సూపర్వైజర్లు గంగాధర్, విష్ణు, సిబ్బంది టీకా శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్నారు.