ఇంద్రవెల్లి, జూలై 31 : జిల్లాలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పీహెచ్‌సీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మండలంలోని దోడంద, చిలాటిగూడ, కోబ్రిగూడ, ఈశ్వర్‌నగర్‌లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పర్యటించి ఇళ్ల వద్ద నిల్వ ఉంచిన నీటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్, సిబ్బంది జాదవ్ శ్రీనివాస్, సేవంత, చంప లక్ష్మి, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
బాబెరతండాలో..
బోథ్, జూలై 22 : మండలంలోని బాబెరతండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కంటెగాం, బాబెరతండా, నిగిని గ్రామాల ప్రజలకు సొనాల పీహెచ్సీ వైద్యుడు కే నవీన్‌రెడ్డి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భారతి, ఏఎన్ఎం ఉష, హెల్త్ అసిస్టెంట్ గోవింద్, సర్పంచులు బాబుసింగ్, నైతం నందు, నైతం కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, జూలై 22 : మండలంలోని ముక్రా(కే)లో స్థానిక ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, వైద్యాధికారి ఆకుదారి సాగర్, హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాశ్, జాదవ్ సుభాష్, ఏఎన్ఎంలు ఆహాల్యాదేవి, తులసి, ఆశ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
నార్నూర్‌లో..
నార్నూర్, జూలై 22 : మండలంలోని చిత్తగూడలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించి, జ్వరపీడితులకు మందులు పంపీణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఈ రాథోడ్ రవీందర్, వినోద్, మోహన్ సింగ్ పాల్గొన్నారు.
డోప్టాలో..
బేల, జూలై 22 : మండలంలోని డోప్టాల గ్రామంలో బేల పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాకేశ్, వైద్య సిబ్బంది రాజమణి, లలిత, ఆశ కార్యకర్త కవిత, పంచాయతీ కార్యదర్శి జోగు ప్రణయ, తదితరులు పాల్గొన్నారు.
వడ్డాడిలో..
తాంసి, జూలై 22 : మండలంలోని వడ్డాడి లో తాంసి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. 60 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశామని సూపర్వైజర్ నగేశ్ తెలిపారు. 52 మందికి బూస్టర్‌డోస్ వేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఏఎన్ఎం సుగుణ, సెకండ్ ఏఎన్ఎం లక్ష్మి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.