
బోథ్, సెప్టెంబర్ 21 : మండలంలోని నక్కలవాడలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సోనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఏఎన్ఎం కవిత, సూపర్ వైజర్ కళావతిని సర్పంచ్ కొడప విజయ్, ఎంపీటీసీ గొడం జుగదీవు శాలువాలతో సత్కరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహదాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు.
కొగ్దూర్లో ..
బేల, సెప్టెంబర్ 21: మండలంలోని కొగ్దూర్ గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. పంచాయతీ పాలక మండలి , సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ముందుగా వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను రూపొందించారు. బేల పీహెచ్సీ ఆధ్వర్యంలో 1003 మందికి వైద్య సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్‌తో అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి , ఐకేపీ వీవోఏను జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వార్ షేక్ భాషా పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు.