ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుంజాల జలపాతం పాలధార మాదిరిగా జాలువారుతూ కనువిందు చేస్తున్నది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు జలధార కొండ కోనలు దాటి, అందమైన జలపాతాన్ని ఆవిష్కరిస్తున్నది. చివరకు పెన్గంగలో కలుస్తున్నది. ఈ జలపాతం భీంపూర్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి ఇంకేందుకు వాటర్ఫాల్ను చూసొద్దామా..
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, జూలై 21