నిర్మల్ అర్బన్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలా చారిని గురువా రం పరామర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజయమ్మ, మామ సింహాచారి అకాల మరణంపై మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైద రాబాద్లోని బోయినపల్లిలోని వేణుగోపాల చారి నివాసానికి మంత్రి వెళ్లారు. అలాగే నిర్మల్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన విజయ్ కుమార్ తండ్రి మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పారిశ్రామిక వేత్త అల్లోల ముర ళీధర్ రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, రాంచందర్, రాంకిషన్ రెడ్డి తదితరులున్నారు.
పొన్కల్‌లో..
మామడ, జూలై 21 : మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన చిక్యాల నవీన్‌రావు తల్లి విజయ గురువారం అనారోగ్యంతో మృతి చెందిం ది. కాగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విజయ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంకిషన్‌రెడ్డి, హరీశ్ కుమార్, గంగా రెడ్డి తదితరులు ఉన్నారు.
లోకేశ్వరంలో..
లోకేశ్వరం, జూలై 21 : లోకేశ్వరంలోని ప్రభా కర్ రావు తండ్రి గణపతి రావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ చైర్మన్ లోలం శ్యాం సుందర్, పీఏసీఎస్ చైర్మెన్ రత్నాకర్‌రావు, ప్రభా కర్ రావు, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ చిన్నా రావు, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
సారంగపూర్, జూలై 21 : ఇటీవల అనా రోగ్యంతో చించోలి(బీ) గ్రామానికి చెందిన 108 పైలెట్ జగన్ మృతిచెందగా, కుటుంబ సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పరా మర్శించారు. ఆయన మృతికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. జగన్ మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. కుటుంబ ఆర్థిక స్థ్థితి గతులు తెలుసుకోని చలించిపోయిన మంత్రి తక్షణ సాయంగా రూ. 10 వేలను అందించారు. ఆయన వెంట ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.