నిర్మల్ అర్బన్, జూలై 20 : నిర్మల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.23.45 కోట్ల నిధులను మంజూరు చేయించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని పట్టణ నాయకులు హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము మాట్లాడుతూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతోనే పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతున్నదన్నారు. 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ఆరేండ్లలో చేశారని కొనియాడారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రూ.23 కోట్లను మంజూరు చేయించారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్ మేడారం అపర్ణ, నాయకులు మేడారం ప్రదీప్, ఆదుముల్ల పద్మాకర్, జగడం రాజు, ధర్మాజిగారి శ్రీనివాస్, కూన చందు, పూదరి సాయికృష్ణ, నేళ్ల అనిల్, గంజి రాజు, రమేశ్, బాలకృష్ణ, రాజు తదితరులున్నారు.
టీయూఎఫ్ఐడీసీ నిధులతో మరింత అభివృద్ధి
టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.23.45 కోట్లతో నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణానికి మంజూరైన నిధుల ప్రొసీడింగ్‌ను హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌కు మంత్రి అందజేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.