“వర్షాకాలంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాధులు సంక్రమించే కాలం. ఇప్పటివరకే అధిక వర్షాలు కురిసి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వైరస్, బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తాయి. ఫలితంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వచ్చే ప్రమాదం అధికం. వీటితోపాటు కలుషిత నీటిని తాగడంతో డయేరియా, కలరా, విరోచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. మంచి బలవర్ధకమైన ఆహారం, గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. అన్నింటికంటే అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ సీజన్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు, గర్భి ణులు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.” అని ఆదిలాబాద్ రిమ్స్ అసిస్టెం ట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణ గిరిశ్ పేర్కొన్నారు. ఆయన ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.- ఆదిలాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు వ్యాధులబారిన పడే అవకాశాలున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృ ష్ణ గిరీశ్ తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉందని, ప్రజలు తమ పరిసరాలతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వాటి బారిన పడుకుండా ఉంటారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
నమస్తే : వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వస్తాయి?
డాక్టర్ : దాదాపు 20 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల రెండో వారంలో ఏకధాటిగా వారం రోజులపాటు వర్షాలు పడ్డాయి. అపరిశు భ్ర వాతావరణం నెలకొంది. పంచాయతీ సిబ్బం ది శుభ్రం చేస్తున్నారు. సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా ప్రభావం అధికంగా ఉంటుంది. ఫలితంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్, పైలేరియా ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. వీటితోపాటు కలుషిత నీటిని తాగడంతో డయేరియా, కలరా, విరోచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. కరోనా విషయంలో కూడా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
నమస్తే : వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్ : ఈ సీజన్లో వ్యాధులు రాకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లోకి దోమలు, ఈగలు రాకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు తొలిగించాలి. వర్షంలో తడవకూడదు. చలిగాలుల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తా యి. బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్, వర్షంలో జర్కిన్లు ధరించాలి. దోమతెరలు వాడాలి. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి.
నమస్తే : ఏ రకమైన ఆహారం మంచిది?
డాక్టర్ : ప్రస్తుత పరిస్థితుల్లో బయటి ఆహారం తీసుకోవద్దు. మంచినీళ్లు కూడా తాగొద్దు. చిరుతిండ్లు, అరగని ఆహారం ఏదీ పడితే అది తినవ ద్దు. ఇంటి భోజనం వండిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. పౌష్టికాహరం పండ్లు, బీన్స్ అధికంగా తీసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగ లు వాలకుండా చూసుకోవాలి. తాగునీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చ ల్లార్చిన నీటిని రోజూ 4 నుంచి 6 లీటర్లు తాగాలి.
నమస్తే : దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నారులపై ప్రభావం ఎలా ఉంటుంది?
డాక్టర్ : ఈ సీజన్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. చల్లటి వాతావరణం ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమంగా మందులు వాడుతూ అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలు ఊపిరితిత్తులు, గర్భిణులకు ఛాతి సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. సీజన్ వ్యాధులు ప్రబలడానికి ప్రమాదం ఉన్నందునా ప్రజలకు జ్వరం వచ్చినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.