నిర్మల్ టౌన్, జులై 19 : నిర్మల్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతోపాటు గురుకులాల ప్రిన్సి పాళ్లు, కేజీబీవీ పాఠశాలల ఎస్వోలతో మంగళ వారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో విద్యార్థులకు ప్రతిరోజూ మంచి ఆహారం, స్వచ్ఛ మైన తాగునీరు ఏర్పాటు చేయలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కిటికీలు, తలుపులు లేకుంటే ఏర్పాటు చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బంది కి సూచించారు. ప్రతి రోజూ హాస్టళ్లలో ఉన్న అన్ని వసతులు పరిశీలించి ఏమైనా లోపాలుంటే వెంట నే సరిదిద్దుకోవాలన్నారు. ఇక నుంచి ప్రతి రోజూ హాస్టళ్లను, గురుకులాలను జిల్లా అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్డీవో రాజేశ్వర్ గౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీని వాస్‌రెడ్డి, గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
విద్యార్థులు బాగా చదవాలి
సోన్, జూలై 19 : విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. సోన్ మండ లంలోని లెఫ్ట్ పోచంపాడ్ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశా ల పరిసరాలు, తరగతి గదులు, కంప్యూటర్ గదిని పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి గణిత శాస్త్రం సబ్జెక్టుపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థిని సమాధానం చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాలని, భోజనం, విద్య, పాఠశాల నిర్వ హణ సక్రమంగా ఉండాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించా రు. తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో సాయి రాం, తదితరులున్నారు.
శుభ్రమైన ఆహారాన్ని అందించాలి
నిర్మల్ అర్బన్, జూలై 19 : శుభ్రమైన ఆహా రాన్ని విద్యార్థులకు అందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలోని గురుకుల కళాశాల వంట గదిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ శుభ్రమైన ఆహా రాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశిం చారు. వంట గదిలో సామగ్రి, కోడిగుడ్లను పరిశీ లించా రు. వంట గదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. కూరగాయలను ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలని కుళ్లి, పాడైపోయిన వాడవద్దని సూచించారు. తహసీల్దార్ సుభాష్ ఉన్నారు.