ఇంద్రవెల్లి, జూలై19 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ సూచిం చారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మామిడిగూడకు చెందిన బాలింత ఉయిక గాంధా రితో మంగళవారం మాట్లాడారు. మామిడి గూడ వాగును దాటివచ్చిన ఆమెను అభినందించి కేసీఆర్ కిట్టును అందజేశారు. అనంతరం పీహెచ్ సీకి వైద్యం కోసం వచ్చిన రోగులతోపాటు ప్రజలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మామిడి గూడకు చెందిన బాలింత ఉయిక గాంధారితోపాటు పసిబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రతగా ఉట్నూర్లో స్పెషల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు ప్రజల కు మెరుగైన వైద్యం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండ లాధ్యక్షుడు షేక్ సుఫియాన్, టీఆర్ఎస్ నాయ కులు రాథోడ్ ఉత్తం, ఫిరోజ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.