ఎదులాపురం,జూలై16: వినూత్న ఆవిష్కర్తలకు ఇన్నోవేటర్ మంచివేదిక అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు మొదలుకొని ఉపాధ్యాయులు, రైతులు , యువకులు, ఐటీ నిపుణులు గృహిణులు పరిశోధకులు, విభి న్న వర్గాల వారు తాము కనుగొన్న వినూత్న ఆవిష్కరణలను 9100 678543 వాట్సాప్ నంబర్‌కు ఆగస్టు 5 లోగా పూర్తి వివరాలతో పంపించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వాటిని గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రశంసా పత్రాలను ఆవిష్కర్తలను అందిస్తామన్నారు. తమ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ఆరు వ్యాఖ్యాలు , రెండు నిమిషాల వీడియో , ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయసు , ప్రస్తుత వృత్తి గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను జిల్లా సైన్స్ అధికారి లేదా 9100678543 కు వాట్సాప్ పంపించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కే. రాఘురమణ 9440060 288 కు సంప్రదించాలన్నారు. గ్రామీణ విద్యార్థుల చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలతో పాటు సృజనాత్మకమైన ఆవిష్కరణలు అంగీకరించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్వోవో ఎన్. భీంకుమార్, ఈ జిల్లా మేనేజర్ బండి రవి, డీఈవో ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి కే. రఘురమణ, ఎఏస్వో మహేందర్ రెడ్డి ఉన్నారు.