ఇంద్రవెల్లి, జూలై 16 : భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లతోపాటు బ్రిడ్జిలు, కల్వర్టుల మరమ్మతులతో పాటు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని హర్కాపూర్తండా, వడగాం, బండాపాటగూడ, పాటగూడ, హిరాపూర్, లాల్ టేకిడి, దస్నాపూర్, పిట్టబోంగురం గ్రామాల్లో శనివారం ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికా రులతో కలిసి కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరద ప్రభా విత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తెగిపో యిన రోడ్లతోపాటు బ్రిడ్జిలు, కల్వర్టులు, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీ లించా రు. మండలంలో జరిగిన నష్టాలపై ఆరా తీశారు. హిరాపూర్‌లో బాధితులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నష్టాల పై శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక లు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలి చ్చారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పునర్నిర్మాణా నికి శాఖల వారీగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ఖానాపూర్ నియోజకవర్గంలో వరద నష్టాన్ని సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వ సీఎస్, గిరిజన శాఖ కమిషనర్‌తోపాటు అధికారులకు నివేదికలు అందిస్తామని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకోవ డానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, మడావి భీంరావ్, సర్పంచ్‌లు ఆత్రం రత్తుబాయి, నాగోరావ్, కుడే కైలాస్, రాథోడ్ సేవంతబాయి, పార్వతిబాయి, భీంరావ్, రాథోడ్ రాంచందర్, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్‌కుమార్, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.
ఆటో, జీపులో పర్యటన
వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే రేఖానాయక్ వడగాం గ్రామం నుంచి ఆటోలో బండాపాట గూడ వరకు వెళ్లారు. బండాపాటగూడ తెగిపో యిన రోడ్డు, కోతకు గురైన బ్రిడ్జిలను పరిశీలించి అక్కడ నుంచి వేరే జీపులో హిరాపూర్ గ్రామానికి చేరుకున్నారు. వరద చేరిన ఇళ్లను పరిశీలించి, అక్కడి నుంచి లాల్టేకిడి గ్రామం వరకు వెళ్లారు. దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించి తిరిగి అదే జీపు లో బండా పాటగూడ వరకు వచ్చారు. కోతకు గురైన బండా పాటగూడ రోడ్డు నుంచి ఆటోలో ఎక్కి వడగాం వరకు వచ్చారు. అక్కడి నుంచి వారి వాహనాల్లో కూర్చొని దస్నాపూర్, పిట్టబొంగురం, మర్కాపూ ర్‌తండా గ్రామాలను పరిశీలిం చారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రతిపాదనలు రూపొందించాలి
వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో వరద నష్టంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఉట్నూర్ మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి పర్యటించారు. మండ లం లో పలు గ్రామాల్లో తలెత్తిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులు, వంతెనలకు తాత్కా లిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ఆదేశిం చారు. పంటల నష్టం వివరాలపై సర్వే చేపట్టాల న్నారు. రైతుల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించా రు. సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అనం తరం ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ రెవె న్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు సమ న్వయంతో పనులు చేపట్టేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్, ఎంపీపీ పంద్రా జైవంత్‌రావ్, తహసీల్దార్ భోజన్న, వైస్ ఎంపీపీ బాలాజీ, అజీమొద్దీన్, రషీద్, రమేశ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
భారీ నష్టం వాటిల్లింది..
భారీ వర్షాలతో ఏజెన్సీ లో భారీగా నష్టం వాటిల్లిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఇటీవల అతి వర్షాలకు మునిగిపోయిన షాపింక్ కాంప్లెక్స్‌లు, రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద పట్టణంలోకి ప్రవే శించకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయా లన్నారు. రానున్న రోజుల్లో ప్రణాళికతో పట్టణాన్ని అభివృద్ధి పర్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కోరారు. అనంతరం అంబేద్కర్ చౌక్ నుండి కొత్త బస్టాండ్ వరకు కాలినడకన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్ర మంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం, పీఏసీ ఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దిన్, పోషన్న, అన్సారీ, శ్యాం తదితరు లు పాల్గొన్నారు.