తానూర్, జూలై 16 : భారీ వర్షాలతో నష్టపో యిన బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని ఎల్వత్, వడొనా, ఔలా (మా), జౌలా(కే), తొండలా, దౌలతాబాద్, బోల్సా గ్రామాల్లో ఆయన విఠల్‌రెడ్డి పర్యటించా రు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, కూలిన ఇండ్లను శనివారం పరిశీలించారు. అనం తరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలు, కూలిన ఇండ్ల సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్ల పనులను వెంటనే చేపట్టాలని అదేశించారు. హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్ రావ్ పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజీప్రసాద్, తహసీల్దార్ పీ వెంకట రమణ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, నాయకులు చంద్రకాంత్యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయినాథ్, లస్మన్న, గోవింద్పటేల్, ఆయా సర్పంచ్‌లు, ఎమ్పీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కుభీర్‌లో..
దెబ్బతిన్న వరద ప్రభా విత ప్రాంతాలను శనివారం ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పరిశీలించారు. జుమ్డ, అంత ర్ని, మాలేగాం, సొనారి, పల్సి తదితర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు. కూలిన ఇండ్లు, తెగి పోయిన రోడ్లను సైతం పరిశీలిం చారు. రైతులకు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈపాటికే దెబ్బతి న్న పంటలు, కూలిన ఇండ్లకు సంబంధించిన ప్రాథమిక నివేదికలను అధికారులు అందించార న్నారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మొహి యొద్దీన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, నాయకులు, రైతులు ఉన్నారు.