ఎదులపురం, జూలై 15 : బాధితులకు భరో సా కల్పించేందుకు అన్ని జిల్లాల్లో భరోసా సెం టర్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వర్చువల్ విధా నం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. భరోసా సెంటర్ శంకుస్థాపన మహోత్సవానికి హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు భరోసా సెంటర్ల ఏర్పాటుకు సహకరం అందించిన మెగా ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రక్చర్ లిమిటెడ్‌కు ధన్యవాదా లు తెలియజేశారు. బాధిత మహిళలకు భరోసా సెంటర్ వేదికగా మారుతుందన్నారు. బాధితులై న మహిళలు, పిల్లలు కోలుకునేందుకు కొంత స మయం పడుతుందని పేర్కొన్నారు.
ఈ భరోసా సెంటర్లను 2016లో మొదటగా హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అన్ని కేంద్రాల్లో బాధితులందరికి సయన్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాకు భరోసా సెంటర్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో భరోసా సెంటర్ మంచి పని తీరును కనబర్చి ఉన్నత స్థానం నిలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం ఎస్పీ డీ ఉదయ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధిత మహిళలు, పిల్లలకు ఉపయోగపడేలా ఉండే భరోసా సెంటర్‌ను ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించిన డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో 1333 స్కేర్యాడ్స్ గజాల స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సమయ్‌జాన్‌రావు, జిల్లా ఫారెస్ట్ అధికారి వీ రాజశేఖర్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డీఎస్పీ వీ ఉమేందర్, ఎం విజయ్ కుమార్, జిల్లా కోర్టు పీపీలు కిరణ్ కుమార్ రెడ్డి, ఎం రమణారెడ్డి, మేకల మధూకర్, సంజయ్ వైరాగర్రె, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఏంవీఐ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు మిల్కా, కృష్ణవేణి, సునీతాకుమారి, సఖి సెంటర్ నిర్వాహకురాలు పవర్ యశోద, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.