ఆదిలాబాద్ రూరల్, జూలై 15: గత ప్రభుత్వాలు ఏ నాడూ మహిళల గురించి ఆలోచించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని అన్ని విధాలుగా కాపాడుతున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు వేణుగంటి ప్రకాశ్, అశోక్‌స్వామి, నర్సింగ్, సాయి, సంజయ్, ఏజాజ్, శ్రీనివాస్, సలీం తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులు జాగ్రత్తగా ఉండాలి
ఎండావాన లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు 400 మందికి రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా పట్టణంలో కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులను నిర్వహించారన్నారు. పట్టణంలో ఎక్కడా వరద చేరకుండా ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేస్తూ పట్టణ ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, అశోక్‌స్వామి, శ్రీనివాస్, రామ్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ పాల్గొన్నారు.