నేరడిగొండ, జూలై 13 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచిం చారు. మండలంలోని వరద ప్రభావిత ప్రాంతా లు కుమారి, కుప్టి, తర్నం తదితర గ్రామాలతో పాటు కడెం వాగు వరద ఉధృతిని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట కు రావద్దని సూచించారు. కడెం నది పరీవాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరదతో చాలా నష్టం జరిగి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఆయన వెంట ఎంపీపీ రాథోడ్ సజన్, తహసీల్దార్ పవన్‌చంద్ర, మండల కన్వీనర్ శివారెడ్డి, వైస్ ఎంపీపీ మహేం దర్‌రెడ్డి, తర్నం సర్పంచ్ విశాల్‌కుమార్, ఇచ్చోడ సీఐ రమేష్‌బాబు, ఎస్ఐ మహేందర్, నాయ కులు గంగయ్య, తదితరులు ఉన్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు పునరుద్ధ్దరిస్తాం
ఇచ్చోడ, జూలై 13 : భారీ వర్షానికి ఇచ్చోడ లోని సిరిచెల్మ రోడ్డు మార్గంలో తెగిపో యిన బ్రిడ్జి నిర్మాణ పునరుద్ధ్దరణ పనులను వర్షాలు తగ్గుము ఖం పట్టిన తర్వాత ప్రారంభిస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. స్తానిక టీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన తెగిపోయిన బ్రిడ్జి ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. తన వెంటే ఉన్న రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. పున రుద్ధరణ పనులు ప్రారంభించేలోపు తాత్కా లిక రవాణా వ్యవస్ధను మెరుగపర్చాలని సూచిం చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుం డా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొ న్నారు. అనంతరం స్థానిక షార్ప్ గార్డెన్లో పునరావాసం పొందుతున్న దుబార్పేట్ గిరిజనులతో మాట్లా డారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుం టుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, నాయకులు ముస్తాఫా, అబ్ధుల్ రషీద్, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి..
గుడిహత్నూర్, జూలై 13: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా మండల అధికారులు వారికి అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధికారులకు సూచించారు. గుడిహత్నూర్ తహసీ ల్ కార్యాలయంలో బుధవారం అధికా రులతో వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచా రం అందించాలని, లోతట్టు కాలనీలో వరద తాకిడికి ఇబ్బందులు పడ్డ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తహసీ ల్దార్ సంధ్యారాణి, మండల ప్రజాపరిషత్ కోఆ ప్షన్ సభ్యుడు ఎస్కే జమీర్, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనంద్, ఎస్ఐ ఎల్ ప్రవీణ్,తగరే ప్రకాశ్, ఫడ్ దిలీప్, తదితరులు ఉన్నారు.