నిర్మల్ అర్బన్, జూలై 13 : భారీ వర్షాల నేప థ్యంలో బాధిత కుటుంబాలకు అల్లోల కుటుం బీకులు అండగా నిలుస్తున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిరంతరం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నష్ట తీవ్రతను పరిశీలిస్తూ బాధి తులకు ఓదార్పునిస్తున్నారు. మరో వైపు మంత్రి ఇద్దరు సోదరులు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేం దర్ రెడ్డితో పాటు కుమారుడు అల్లోల గౌతం రెడ్డి నిరంతరం పర్యటిస్తున్నారు. అల్లోల మురళీధర్ రెడ్డి సారంగాపూర్ మండలంలో విస్తృతంగా పర్యటిస్తుండగా, అల్లోల సురేందర్ రెడ్డి లక్ష్మణ చాంద మండలం, నిర్మల్‌లో విస్తృతంగా పర్యటి స్తున్నారు. కుమారుడు అల్లోల గౌతం రెడ్డి నిర్మల్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌తో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుం టున్నారు. ఐదు రోజులుగా వరద బాధితులకు ఓదార్పునిస్తున్న మంత్రి అల్లోలపై జిల్లా వాసులు ప్రశంశలు కురిపిస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లో సైతం ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారని పట్టణ ప్రజలు పెదవివిరుస్తున్నారు.