కడెం, జూలై 9: కడెం కాలువల ద్వారా వానకాలం పం టల సాగు కోసం విడుదల చేసిన నీటిని ఆయకట్టు రైతులు వినియోగించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. మండలకేంద్రం లో ఆ యకట్టు అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి కడెం జలాశయం ప్రధాన కా లువకు శనివారం నీ టిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుందని, అయితే ప్రధాన కాలువ ద్వారా కడెంతో పా టు, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల మండలాల పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీటిని అందించేందుకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారన్నారు. రైతుల అవసరాల దృష్ట్యా మరిన్నీ క్యూసెక్కుల నీటిని కూడా విడుద ల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయకట్టు ఈ ఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, కడెం పెద్దూర్ సర్పంచ్ కొండపురం అనూష, నాయకులు గట్ల నల్లగొండ, లక్ష్మణ్, హైమద్, రవి, గౌసొద్దీన్, మహమూద్ నాయకులు ఉన్నారు.