బజార్హత్నూర్, జూలై 8 : శాంతిభద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజలతో మమేకమై సేవలందించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. మండలంలోని క్రైం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లోని లాకప్రూం, రిసెప్షన్ సెంటర్, రైటర్ గదులను పరిశీలించి తగు సూచనలు చేశారు. గ్రామంలో సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం దగ్గరగా ఉండడంతో ఎల్లవేళలా నిఘూనేత్రం పనితీరును పటిష్టంగా ఉంచాలని పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో మట్కా ఎక్కువగా సాగుతుందని, ప్రజలు ఆ దాని మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో పేకాడే వారిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్లో ఉన్న పాత వాహనాలను పరిశీలించి పత్రాలు ఉన్న వాటిని యజయానులకు అప్పగించాలని పేర్కొన్నారు. మండలంలోని మారుమూల గ్రామాల్లో ఎలాంటి సహకారం కావాలన్నా పోలీసులు ముందుండాలని సూచించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిధిలోని పరిసరాలను పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట బోథ్ సీఐ నైలు, ఎస్ఐ ముజాహిద్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.