మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటి వాటిని సంరక్షించాలని ఎస్ఐ కృష్ణకుమార్ అన్నారు. మండలంలోని సాంగిడి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాకేశ్, యువజన నాయకుడు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు జీవనాధారం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు జీవనాధారమని హర్కపూర్తండా ఉపసర్పంచ్ రాథోడ్ రాధిక అన్నారు. హర్కపూర్తండాలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాథోడ్ కైలాస్, ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ రాజేశ్వర్, ఉపాధ్యాయురాలు రాథోడ్ సరస్వతి, పంచాయతీ కార్యదర్శి జాదవ్ అరవింద్, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చాంద(టీ) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళ అన్నారు. హరితహారం, బడిబాటలో భాగంగా చాంద(టీ) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, సాగర్రావ్, పీఈటీ రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.
పిప్పల్కోటి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ కల్యాణి మొక్కలు నాటి నీరు పోశారు. హరితహారంలో మరిన్ని మొక్కలు నాటుతామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాష్, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.